నిర్మాతగా విజయ్ దేవరకొండ..!

-

టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే తానో స్టార్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో విజయ్ కోలీవుడ్ లో తెరంగేట్రం చేస్తున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రెడ్ సినిమా సెట్స్ మీద ఉండగా మరికొన్ని సినిమాలు క్యూలో ఉన్నాయి.

ఇదిలాఉంటే కేవలం హీరోగానే కాదు నిర్మాతగా కూడా కొత్త టర్న్ తీసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. 3 సినిమాలు హిట్ కొట్టేసరికి నిర్మాతగా అయ్యేంత డబ్బు సంపాదిచాడా అంటే నిర్మాత అయ్యేందుకు టేస్ట్ కావాలి డబ్బు కాదన్నట్టుగా సమాధానం చెబుతున్నాడు. ఇక నిర్మాతగా తన ప్రొడక్షన్ పేరు కింగ్ ఆద్ ద హిల్ అని లోగో రిలీజ్ చేశాడు.

మరి నిర్మాతగా మారాలన్న ఆలోచన కొత్తగా వచ్చిందా లేక దానికి తాను గ్రౌండ్ వర్క్ చేశాడో తెలియదు కాని తను ప్రేక్షకుల ముందుకొచ్చే ప్రతిసారి ఏదో ఒక సరి ప్రైజ్ ఇస్తున్న విజయ్ స్టార్ హీరోగానే కాదు స్టార్ ప్రొడ్యూసర్ గా కూడా క్రేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు రౌడీ ఫ్యాన్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version