మ‌ళ్లీ మొద‌టిస్థానంలో నిలిచిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. క్రేజ్ మామూలుగా లేదు

విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే టాలీవుడ్‌లో విల‌క్ష‌ణమైన న‌టుడు. ఆయ‌న త‌న మేన‌రిజం, న‌ట‌న‌, స్టైల్‌తో కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. చాలా త‌క్క‌వ టైమ్‌లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చ‌కున్నాడు విజ‌య్‌. ఆయ‌న ఇప్పుడు సౌత్ ఇండియాలోనే స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మ‌రో రికార్డును న‌మోదు చేశాడు.

 

విజ‌య్ అంటే ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోయాడు. అంతేకాదు ఇప్పుడు మరోసారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు విజయ్ దేవ‌ర‌కొండ‌. వ‌రుస‌గా ఆయ‌న ఈ జాబితాలో మొద‌టిస్థానంలో నిల‌వ‌డం నాలుగోసారి.

ప్రతి సంవ‌త్సరం లాగానే హైదరాబాద్ టైమ్స్ ఈ సారికూడా మోస్ట్ డిజైరబుల్ నటీనటుల జాబితాను త‌యారు చేసింది. ఇందులో విజయ్ మొదటి మ‌ళ్లీ మొద‌టి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో అంద‌రికంటే ఎక్కువ మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇదే ఆయ‌న్ను మొద‌టి స్థానంలో నిలిపింది. 2018 నుండి ఆయ‌న మొద‌టి స్థానంలోనే ఉంటున్నారు.