ఆస్ట్రేలియాలో వేగంగా వ్యాపిస్తున్న ప్లేగువ్యాధి.. ఇండియా సాయం!

-

ఎలుక‌లతో వ‌చ్చే స‌మ‌స్య‌లు అన్ని, ఇన్ని కావు. అవి లేని దేశ‌మే లేదు. పంట‌ల‌ను నాశ‌నం చేసే ద‌గ్గ‌రి నుంచి పెద్ద పెద్ద‌రోగాల‌ను కూడా మోసుకురాగ‌ల‌వు. ఒక‌ప్పుడు వీటి దెబ్బ‌కు ఊర్ల‌కు ఊర్లే ఖాళీ అయిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇంత అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ వ‌చ్చాక కూడా వాటి బెడ‌ద పోవ‌ట్లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా ప‌రిస్థితి ఇలాగే ఉంది.

ఆస్ట్రేలియాలో ఈ ఎలుక‌ల సమస్య అత్యంత తీవ్రంగా మారింది. ఆ దేశంలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఎలుక‌లు విప‌రీతంగా త‌యార‌య్యాయి. వాటి కార‌ణంగా అక్క‌డ పెద్ద ఎత్తున ప్లేగు వ్యాధి సోకింది. దీంతో ఆ రాష్ట్రం ఇండియా సాయం కోరుతోంది.

ఆ రాష్ట్రం కోసం ఇండియాని 5000 లీటర్ల ఎలుకల విషం బ్రొమాడియోలోన్ ఇవ్వాల‌ని కోరింది. ఇండియాలో ఈ పాయిజన్‌ను నిషేధించారు. సౌత్ వేల్స్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అక్క‌లు ఎలుక‌లు ఎగ‌బ‌డి ఆహార ప‌దార్థాల‌ను తింటున్నాయి. మ‌నుషుల‌కు నానా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. అయితే ఈ పాయిజ‌న్ తో ఎలుక‌ల‌తో పాటు ఇత‌ర ప్రాణుల‌కు కూడా ప్ర‌మాదం. మ‌రి ఈ మందు దిగుమ‌తికి ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news