`వరల్డ్ ఫేమస్ లవర్` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. అయ్యో ఏంటిది విజ‌య్‌..?

-

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ప్ర‌స్తుతం యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో. అయితే ఇటీవ‌ల విజయ్ దేవరకొండ డియ‌ర్ కామ్రేడ్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత ఈయ‌న చేసిన సినిమా `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటించారు. రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లా హీరోయిన్లు న‌టించిన ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వ‌హించారు. అలాగే ఈ కుర్ర హీరో ఇదే త‌న చివ‌ర ప్రేమ‌క‌థా చిత్ర‌మంటూ ప్రేమికుల‌రోజైన ఫిబ్ర‌వ‌రి 14న `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

దీంతో భారీ అంచ‌నాల న‌డుమ‌ 1150 స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుదలైంది. ఇక టీజర్లు, ట్రైలర్లకు విశేష స్పందన రావడంతో అడ్వాన్స్ బుకింగ్‌కు కూడా మంచి స్పందన లభించింది. సినిమా విష‌యానికి వ‌స్తే.. ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమలో రాజి తత్వం ఉంటుంది. ప్రేమలో దైవత్వం ఉంటుంది. ప్రేమలో ఒకరిపై మరొకరికి అంతులేని ఆరాధన ఉంటుందనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కించారు. బ్రేకప్ తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ విధమైన మనోవేదన అనుభవిస్తారనేది చూపించి మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది

ఇక ప్రేమికులరోజు విడదలైన ఈ సినిమా తొలిరోజు భారీ వసూళ్లు రాబడుతుంద‌ని అంద‌రూ ఊహించారు. అయితే దానికి భిన్నంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజు 6.5కోట్ల గ్రాస్ ను అలాగే 4.34కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డీసెంట్ అనిపించింది. నిజానికి మొదటి రోజు ఈచిత్రం 7కోట్ల వరకు షేర్ ను రాబడుతుందని ట్రెడ్ వర్గాలు అంచనా వేశాయి. కాని, అలా జ‌ర‌గ‌లేదు. మ‌రి ముందు ముందు ఈ సినిమాకు క‌లెక్ష‌న్స్ ఎలా ఉంటాయో చూడాలి.
తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ లవర్ మొదటి రోజు వసూళ్ల వివరాలు :

నైజాం – 2.05 కోట్లు

సీడెడ్ – 0.37 కోట్లు

ఉత్తరాంద్ర – 0.51 కోట్లు

గుంటూరు – 0.43 కోట్లు

తూర్పు గోదావరి – 0.31 కోట్లు

పశ్చిమ గోదావరి – 0.24 కోట్లు ‘

కృష్ణా – 0.25 కోట్లు

నెల్లూరు – 0.18 కోట్లు
———————————————–
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం- 4.34కోట్లు
———————————————–

Read more RELATED
Recommended to you

Latest news