కరోనా ఎఫెక్ట్ : విజయ్ దేవరకొండ ఏం చేస్తున్నాడో చూడండి!

-

ప్రపంచమంతా కరోనా ధాటి గజగజ వణికిపోతోంది. భారతదేశంలోనూ కరోనా శర వేగంగా విజృంభిస్తోంది. దీంతో ప్రజలందరూ దాదాపు స్వీయ నిర్భందంలోనే ఉంటున్నారు. ముఖ్యంగా సినీ సెలెబ్రిటీలైతే ఇంటికి పరిమితమయ్యారు. గతవారం రోజులుగా హౌస్ అరెస్ట్ అయ్యారు. సినిమా షూటింగ్స్‌ను ఆపివేయడంతో ఇంట్లోనే గడిపేస్తున్నారు.

కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. నేడు జనతా కర్ఫ్యూ అంటూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటికే పరిమితమవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అవగాహన కలిగించేందుకు సినీలోకం ముందుకు వచ్చింది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని భాషలకు చెందిన సినీ ప్రముఖులు ప్రజలకు అవగాహన కలిగించేందుకు సందేశాలను ఇచ్చారు.

ఇక స్వీయ నిర్భందంలో భాగంగా అల్లు అర్జున్ తన బామ్మ, కూతురితో ఆడుకున్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. వరుణ్ తేజ్ ఇంట్లోనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం, నిఖిల్ వర్కౌట్లు చేయడం తెలిసిందే. తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాత్రం తన తమ్ముడు ఆనంద్‌తో కలిసి తాపీగా చదరంగం ఆడుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ (ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు) చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news