vijay dewarankonda about his strength: నాది బలుపు కాదు.. 200 కోట్లు కొట్టి చూపిస్తా అంటూ విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. లైగర్ తో 200 కోట్లు కొడతాను అన్నాను కొట్టలేకపోయాను అప్పుడు చాలా మంది తిట్టారు, కానీ ఏదో ఒకరోజు 200 కోట్లు కొడతాను, అప్పటివరకు మీరెంతైనా తిట్టండి పడతానని స్పష్టం చేశారు విజయ్ దేవర కొండ. ఈ వ్యాఖ్యలు ఫ్యామిలీ స్టార్ ఈవెంట్ లో పేర్కొన్నారు.
కాగా.. పరశురాం దర్శకత్వంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’.. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ఫ్యామిలీ స్టార్” మూవీని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.