‘నోటా’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ

-

Vijay Deverakonda nota Movie finally gets a relase date

విజయ్ దేవరకొండ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరక్టర్ ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తున్న సినిమా నోటా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సిఎంగా నటిస్తున్నాడు. తమిళంలో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.

ఈ సినిమా రిలీజ్ విషయంలో ఏర్పడిన కన్ ఫ్యూజన్ అందరికి తెలిసిందే. సినిమా రిలీజ్ కూడా ఆడియెన్స్ పోలింగ్ నిర్వహించిన విజయ్ దేవరకొండ ఫైనల్ గా అక్టోబర్ 5న నోటా రిలీజ్ ఫిక్స్ చేశాడు. కె.ఇ. జ్ఞానవెల్ రాజా నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ నటించింది. గీతా గోవిందంతో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ నోటాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news