వైష్ణవ్ తేజ్ సినిమాలో విలక్షణ నటుడు

-

మెగా ఫ్యామిలీ నుండి కొత్తగా హీరోగా ఎంట్రీ ఇస్తున్న వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఈమధ్యనే మొదలైంది. సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక వైష్ణవ్ తేజ్ తో పాటుగా ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. వైష్ణవ్ తేజ్ తో విజయ్ సేతుపతి కాంబినేషన్ అదిరింది కదా.

ఇప్పటికే విజయ్ సేతుపతి మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి తెలుగులో కూడా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తాడని తెలుస్తుంది. ఈ పాత్ర కోసం ఆ హీరో భారీగా డిమాండ్ చేశాడట. అయినా సరే సినిమాకు అతను ప్లస్ అవుతాడని ఓకే చేశాడట. అయితే దీనికి సంబందించిన అఫిషియల్ డీటైల్స్ త్వరలో వెళ్లడవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news