దేశ రాజకీయాల నుంచి చంద్రబాబును బహిష్కరించాలి: సోము వీర్రాజు

-

MLC Somu Veerraju fires on ap cm chandrababu

బీజేపీ ఏపీ ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాజకీయాల్లో కనీస సిద్ధాంతాలు లేకుండా రాజకీయాన్ని వ్యాపారంగా భావించే వ్యక్తి చంద్రబాబు అని ఆయన అన్నారు. దేశ రాజకీయాల నుంచి చంద్రబాబును బహిష్కరించాలని ఆయన తెలిపారు. చంద్రబాబుతో అంటకాగే వాళ్లకు నీతి, నియమాలు లేనట్టే లెక్క అని స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్మాణం చేస్తానంటున్న అమరావతి కేపిటల్ అంతా బోగస్ అని.. అది ఒక రియల్ ఎస్టేట్ దందా అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news