అభిమాని చెప్పు మోసిన స్టార్ హీరో!

-

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ త‌న గొప్ప‌త‌నాన్ని మ‌రోసారి చాటుకున్నారు. ఫ్యాన్స్ విష‌యంలో చాలా కేర్ తీసుకుంటూ వారికి నిత్యం అందుబాటులో వుంటుంటారు. ఇటీవ‌ల అధికార పార్టీ విజ‌య్‌పై క‌క్ష‌గ‌ట్టి అత‌ని ఇంట్లో లేని స‌మ‌యంలో సోదాలు నిర్వ‌హించి ఇబ్బందుల‌కు గురిచేసిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఫ్యాన్స్ విజ‌య్‌కి కొండంత అండ‌గా నిలిచారు.

ఈ విష‌యాన్ని ఎప్పటిక‌ప్పుడు గుర్తు చేస్తూనే వున్న హీరో విజ‌య్ ఇటీవ‌ల ఓ అభిమాని చెప్పులు మోయ‌డం ప‌లువురిని షాక్ కు గురిచేసింది. ఇటీవ‌ల గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మీతి చెందిన విష‌యం తెలిసిందే. గ‌త శ‌నివారం జ‌రిగిన బాలు అత్య‌క్రియ‌ల్లో హీరో విజ‌య్ పాల్గొన్నారు. సాధార‌ణ యువ‌కుడిగా విజ‌య్ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్హంగా ఫ్యాన్స్ విజ‌య్ కోసం ఎగ‌బ‌డ‌టంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ చెల్లాచెదుర‌య్యారు.

ఈ స‌మ‌యంలో ఓ అభిమాని చెప్పులు ప‌డియాయి. అందులో ఓ చెప్పు దొరికింది. మ‌రో చెప్పు కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గా దాన్ని స్వ‌యంగా హీరో విజ‌య్ తీసుకుని అభిమానికి అందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విజ‌య్‌కి త‌మిళ‌నాట సూప‌ర్‌స్టార్‌ని మించిన అభిమానులు ఎందుకు ఏర్ప‌డ్డారో ఈ చిన్న సంఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ అంటూ సోష‌ల్ మీడియాలో హీరో విజ‌య్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news