దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. 19ఏళ్ల ఆడకూతురుని హింసించి బలత్కారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగింది. అత్యాచారం జరిగిన తర్వాత చికిత్స పొందుతూ బాధితురాలు తన ప్రాణాలు కోల్పోయింది. ఐతే బాధితురాలి శవానికి పోలీసులే అంత్యక్రియలు చేసారు. అది కూడా బాధితురాలి కుటుంబ సభ్యులని ఎవరినీ పిలవకుండా. అంత అర్థరాత్రి ఎవరికీ తెలియనివ్వకుండా కనీసం కుటుంబ సభ్యులకి కూడా సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలు జరిపించడం అనుమానించదగ్గదిగా మారింది.
ఈ మేరకు ప్రతిపక్షాలు ఉత్తరప్రదేశ్ పోలీసులని వివరణ కోరుతున్నాయి. ఐతే నేషనల్ కమీషన్ ఫర్ వుమెన్ ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండించింది. అర్థరాత్రే ఎందుకు అంత్యక్రియలు జరిపారు. కుటుంబ సభ్యులకి ఎందుకు పిలవలేదు. వీటన్నింటికీ జవాబులు ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్ డీజీపీకీ లేఖ రాసింది. మరి ఉత్తరప్రదేశ్ డీజీపీ వీరికి ఏ సమాధానం ఇస్తారో చూడాలి.