‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్‌ యాక్టింగ్‌ నెక్స్ట్ లెవల్.. విజయేంద్రప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

-

ప్రపంచం మొత్తం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. మరి కొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో చిత్రం ప్రదర్శితం కానుంది. ఇకపోతే ఈ ఫిల్మ్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను డైరెక్టర్, హీరోలు సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశారు. చివరి రోజు వరకు అనగా రిలీజ్ డేట్‌కు ముందు రోజు వరకు ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పర్యటించారు.

 

సినిమాలో ఎవరి పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలుస్తుందన్న ప్రశ్నకు డైరెక్టర్ రాజమౌళి ఇద్దరివీ హైలైట్‌గా నిలుస్తాయని, స్టోరి, విజ్యువల్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయని చెప్తూ వచ్చారు. కాగా, ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ మాత్రం హీరోల పర్ఫార్మెన్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ సక్సెస్ ఫుల్ స్టోరి రైటర్‌గా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన తెలుగు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’ పిక్చర్ గురించి మాట్లాడారు. సినిమాలో ప్రతీ సీన్ హైలైట్‌గా ఉంటుందని, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయని చెప్పారు. హీరోలు ఇద్దరూ కొట్టుకుంటుంటే తాను కంటతడి పెట్టుకున్నానని, సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అలానే కన్నీళ్లు పెట్టుకుంటారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే చిత్రంలో హీరోలిద్దరిలో ఎవరి పర్ఫార్మెన్స్ హైలైట్ అన్న ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర సమాధానమిచ్చారు. తనకు తారక్ యాక్టింగ్ చాలా ఇష్టమని, సినిమా చూడగానే జూనియర్ ఎన్టీఆర్ అందరికీ కనెక్ట్ అయిపోయి నచ్చుతాడని చెప్పాడు. అయితే, పర్ఫార్మెన్స్ పరంగా యాక్టింగ్‌కు ఎక్కువ స్కోప్, లేయర్స్ ఉన్న రోల్ రామ్ చరణ్‌ది అని వివరించాడు.

ఆ పాత్ర పోషించడం చాలా కష్టమని, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్‌కు తారక్ కంటే కొన్ని మార్కులు ఎక్కువే వేస్తానని ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. రాజమౌళి దర్వకత్వం వహించిన చిత్రాలన్నిటికీ విజయేంద్రప్రసాద్ కథలందించిన సంగతి అందరికీ తెలిసిందే. మహేశ్ బాబు- రాజమౌళి కాంబో మూవీకి కూడా విజయేంద్ర ప్రసాదే స్టోరి అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news