300 కోట్లతో మహావీర్ కర్ణ.. చియాన్ విక్రం భారీ స్కెచ్..!

-

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రం ఓ క్రేజీ ప్రాజెక్ట్ షురూ చేశాడు. అతను హీరోగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఆర్.ఎస్ విమల్ డైరక్షన్ లో మహావీర్ కర్ణ సినిమా చేస్తున్నాడు విక్రం. కర్ణుడి జీవితం ఆధారంగా ఈ సినిమా వస్తుందట. సినిమాలో చియాన్ విక్రం గెటప్ కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు ముగిశాయి. తిరువునంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో మహావీర్ కర్ణ పూజా కార్యక్రమాలు జరిగాయి.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ సినిమాలకు బీభత్సమైన క్రేజ్ వచ్చింది. ఎంత బడ్జెట్ సినిమా అయినా సరే కరెక్ట్ గా తీయగలిగితే అంతకు అంత రాబట్టొచ్చని అది ప్రూవ్ చేసింది. కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లు లేని విక్రం ఈ మహావీర్ కర్ణతో సత్తా చాటాలని చూస్తున్నాడు. స్కెచ్ మాత్రం భారీగానే ఉన్నా సినిమా ఆశించిన అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. సినిమా కాస్ట్ అండ్ క్రూ మిగతా విషయాల మీద అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news