‘హనుమాన్’ విలన్ తో డేటింగ్లో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ !

-

Vimala Raman: ఇండస్ట్రీలో మరో లవ్ ఎఫైర్ బయటపడింది. హనుమాన్ సినిమాలో విలన్ గా చేసిన వినయ్ రాయ్ ప్రేమలో పడినట్లు సమాచారం అందుతుంది. హీరోయిన్ విమల రామన్ తో ఆయన రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి ట్రెండీ ఫొటోస్ షూట్ లో పాల్గొన్నారు.

Vimala Raman Has Confirmed Details About Her Live In Partner

దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ప్రేమాయణంపై ఈ జంట ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. కాగా విమల రామన్ తెలుగులో ఎవరైనా ఎప్పుడైనా, గాయం 2, చట్టం నువ్వా నేనా, రాజ్, డాం 999 తదితర సినిమాలలో హీరోయిన్గా నటించారు. కాగా వినయ్ రాయ్ ఇటీవల హానుమాన్‌ సినిమాలో విలన్‌ గా మెరిసాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news