విశాల్ ఎంగేజ్‌మెంట్ బ్రేక‌ప్‌..!

3007

తెలుగు వాడు అయినా తమిళ స్టార్ హీరోగా ఎదిగిన‌ విశాల్ ఇటీవల అనీషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన అనీషా ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కూడా న‌టించింది. ఇటీవల వీరిద్దరికీ హైదరాబాద్‌లో ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అక్టోబ‌ర్ 9వ తేదీన వీరి వివాహానికి ముహూర్తం కూడా పెట్టేశారు. ఈ క్ర‌మంలోనే ఎంగేజ్మెంట్ కూడా అతికొద్ది మంది స‌మ‌క్షంలోనే జ‌రిగింది.


ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం వీరి పెళ్లి క్యాన్సిల్ అయిన‌ట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్నట్లు సమాచారం. కార‌ణాలు తెలియ‌దు కాని… అనీషా రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఆమె త‌ర‌చూ త‌న నిశ్చితార్ధం ఫోటోలు, విశాల్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ వ‌చ్చేది. అటు విశాల్ కూడా అనీషా ఫొటోలు త‌ర‌చూ ట్విట్ట‌ర్లో షేర్ చేసేవాడు.

ఇక అనూష స‌డెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో తన నిశ్చితార్ధపు ఫొటోలన్నీ తొలగించింది. అలానే విశాల్ ఫోటోలను కూడా డిలీట్ చేసింది. ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం బయటకి పొక్క‌డం లేదు. విన‌ప‌డుతోన్న గుస‌గుస‌ల‌ను బ‌ట్టి చూస్తే అనీషా మాత్రం పెళ్లి బ్రేక్ చేసుకోవాలని నిర్ణయించుకుందని టాక్. కానీ విశాల్ మాత్రం ఆమెను ఒప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నాడట. మరేం జరుగుతుందో చూడాలి..!