పందెం కోడి-2 టీజర్.. పులిమేక కలిసి ఆడే ఆట..!

-

విశాల్ హీరోగా వచ్చిన పందెం కోడి సినిమా గుర్తుంది కదా లింగుసామి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ సాధించింది. ఆ సినిమాకు సీక్వల్ గా పందెం కోడి-2 వస్తుంది. విశాల్, కీర్తి సురేష్ లీడ్ రోల్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి కూడా నటిస్తుంది. ఇక సినిమా నుండి టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది.

పక్కా మాస్ సినిమాగా వస్తున్న ఈ సినిమా టీజర్ లో నేనికా ఆడుకోవడం మొదలుపెట్టలేదు అడ్డుకోవడమే మొదలుపెట్టా.. అంటూ విశాల్ చెప్పే డైలాగ్ తో పాటుగా చివర్లో ఇది పులి మేక ఆట కాదు పులి మేక కలిసి ఆడే ఆట అంటూ చెప్పడం బాగుంది. సీక్వల్ సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ టీజర్ వచ్చింది.

లింగుసామి మరోసారి పందెం కోడి-2తో తన సత్తా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. టీజర్ చూస్తే కచ్చితంగా ఇది తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి హిట్ కొట్టేలా ఉంది. ఈమధ్య విశాల్ నటించిన అన్ని సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news