నోట్లో బీడీ.. మెడలో ఇయర్ ఫోన్స్.. దాస్ లుక్ సూపరంతే.

ఫలక్ నుమా దాస్ సినిమాతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విశ్వక్ సేన్, హిట్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఫలక్ నుమా దాస్ లో హైదరాబాద్ యువకుడిగా పూర్తి మాస్ గెటప్ లో కనిపించగా, హిట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా వయసుకి మించిన పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్, ఫాగల్ అనే సినిమా చేస్తున్నాడు. నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా కారణంగా నిలిచిపోయిన చిత్ర షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది.

ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ సినిమా కోసం తన గెటప్ ని పూర్తిగా మార్చేసాడు. సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతున్నందున సోషల్ మీడియాలో ఒకానొక ఫోటో షేర్ చేసాడు. గత సినిమాల్లో ఎప్పుడూ కనిపించనంతగా విశ్వక్ సేన్ పూర్తిగా మారిపోయాడు. నోట్లో బీడీ, మెడలో ఇయర్ ఫోన్స్, కొంచెం చింపిరిగా కనిపించే జుట్టుతో స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో చాలా కొత్తగా కనిపించాడు. హిట్ సినిమాలో వయసుకి మించిన పాత్రలో కనిపించిన విశ్వక్ సేన్, ఫాగల్ సినిమాతో తన వయసుకి వచ్చేసాడని అనిపిస్తుంది. ఈ గెటప్ చూస్తుంటే సినిమాలో మాస్ అంశాలతో పాటు స్టైలిష్ గా ఉండనుందని అర్థం అవుతుంది.