బిగ్ బాస్ షో పై వితికషేరు సంచలన కామెంట్లు..!?

-

బుల్లితెరపై బిగ్ బాస్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇక షోలో ప్రస్తుతం ఐదుగురు టాప్ 5కి చేరుకున్నారు. బిగ్ బాస్ షో మరో వారం రోజుల్లో నాలుగో సీజన్‌ను కూడా పూర్తి చేసుకోబోతుంది. అందరు అనుకున్నట్టుగానే మోనాల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక మిగిలిన వారిలో అఖిల్, అభిజీత్, సోహెల్, అరియానా, హారిక ఫినాలేలోకి అడుగుపెట్టారు. వీరిలో విజేత ఎవరన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 20న జరిగే గ్రాండ్ ఫినాలే లో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది.

vithika-sheru

ఈ సమయంలో బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ వితిక షేరు బిగ్ బాస్ షో పై సంచలన కామెంట్లు చేశారు. బిగ్ బాస్ చరిత్రలో భార్య భర్తలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది లేదు. కానీ తెలుగు బిగ్ బాస్ లో ఆ రికార్డు సొంతం చేసుకుంది వరుణ్ సందేశ్, వితిక జంట. ఆ సీజన్ కి ఈ ఇద్దరు హైలెట్ గా నిలిచారు. హౌస్ లో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ.. మధ్య మధ్యలో ముద్దులు హగ్గులతో హడావిడి చేశారు. ఇక షోలో జెంటిల్ మెన్ గా పేరుతెచ్చుకున్న వరుణ్ సందేశ్ తనదైన ఆటతో సీజన్ 3లో ఫినాలే వరకు వెళ్ళాడు. ఫినాలే ముందు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇక వితిక సీజన్ మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.

తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమెకు బిగ్ బాస్ కు సంబందించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో బిగ్ బాస్ గురించి సంచలన విషయాలు చెప్పుకొచ్చింది వితిక. నాలుగో సీజన్ విన్నర్ ఎవరు అవుతారంటూ కొందరు.. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటూ మరికొందరు ఆమెను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోపై వితిక షేరు సంచలన కామెంట్లు చేసింది. బిగ్ బాస్ షోలో చూపించేవి నమ్మకండి. ఎడిటర్లకు నచ్చిన కంటెంట్‌నే వాళ్లు ఎక్కువగా చూపిస్తారు. దీని వల్ల ఒరిజినల్ క్యారెక్టర్లు బయట పడవు. కాబట్టి.. మీకు బాగా నచ్చిన, తెలిసిన కంటెస్టెంట్‌కే ఓట్లు వేయండి. నేనైతే నాకు తెలిసిన వాళ్లనే ఓట్లు వేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది వితిక. ఇప్పుడు ఈ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news