‘నేను చావాల‌ని కోరుకునే వారికి సంక్రాంతి శుభాకాంక్షలు’ : వ‌ర్మ

ఎప్పుడు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తు వార్త‌ల‌లో నిలిచే డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సంక్రాంతి సందర్భంగా ప‌లువురికి ట్విట్ట‌ర్ వేదికగా శుభాకాంక్షలు చెబుతూ.. త‌న దైన శైలీలో వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను విమ‌ర్శించే వారికి, త‌న చావును చూడాల‌నుకునే వారి అంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. “నా చావును కోరుకునే వారంద‌రికీ ఆ దేవుడు త‌ప్ప‌కుండా సాయం చేస్తారు. త్వ‌ర‌లోనే మీ కోర‌క ను ఆ దేవుడు నేర‌వెరుస్తాడు.” అని ట్వీట్ చేశాడు.

అలాగే ప‌లువురికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ల వ‌ర్షం కురిపించారు. “అంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు. అంద‌రూ ముకేశ్ అంబానీ కంటే ఎక్కువ సంపాదించాలి. ఆ విధంగా ఆ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు” అని ట్వీట్ చేశాడు. అలాగే ఎవ‌రికీ కూడా క‌రోనా సోకకుండా ఉండాల‌ని అన్నారు. “మ‌గ‌వాళ్లు అంద‌రికీ అంద‌మైన స్త్రీలు భార్య‌లుగా రావాలి. స్త్రీల‌కు శ‌క్తి వంతమైన భ‌ర్త‌లు దొర‌కాలి. భ‌ర్త‌లు ఏం చేసినా.. భార్య‌లు బాధించ‌కూడాదు” అంటు ట్వీట్ చేశాడు. అలాగే నిర్మాతల‌పై కూడా ట్వీట్ల వ‌ర్షం కురిపించారు.

 

“సినీ నిర్మాతలంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు. మీరు ఏ టికెట్ ధ‌ర‌ను కోరుకున్నారో.. అలాగే ప్లాప్ ల‌తో పోగోట్టుకున్న డబ్బును కూడా ప్ర‌భుత్వ‌మే చెల్లించేలా.. దేవుడు చేస్తాడ‌ని నేను కోరుకుంటున్నాను” అని అన్నాడు. “చిన్న సినిమా నిర్మాత‌లంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు. ప్ర‌తి చిన్న సినిమా కూడా బ‌హుబ‌లి కన్న పెద్ద హిట్ కావాలి” అని తాను కోరుకుంటున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. అయితే వ‌రుస ట్వీట్ ల‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.