..?ఈ మధ్యకాలంలో జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకున్న కమిడియన్లు ఏదో ఒక విధంగా రాజకీయ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైపర్ ఆదిని మొదలుకొని చాలామంది కమెడియన్లు సినిమా సెలబ్రిటీలనే కాకుండా రాజకీయ నాయకులను కూడా విమర్శిస్తూ ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే ఇదిలా ఉండగా తాజాగా జబర్దస్త్ ఇమ్మానుయేల్ కి కూడా వైసిపి పార్టీ నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా జబర్దస్త్ ఇమ్మానుయేల్ ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నారు. ఇందులో గ్రామ వాలంటీర్ గా అతడు పనిచేస్తుండగా ఆ గ్రామంలో ఉండే అమ్మాయిని ప్రేమలో పడేసి ప్రేమ వాలంటీర్ గా మారిపోతాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ను నిన్న విడుదల చేయగా ఈ ట్రైలర్ చూసిన వైసిపి మద్దతుదారులు ఇమ్మానుయెల్ ను హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే ఇప్పటికే గ్రామ వాలంటీర్ల మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇలాంటి సమయంలోనే వాలంటీర్ మీదే వెబ్ సిరీస్ తీయడం అనేది రిస్కే.. అందుకే ఇమ్మానుయెల్ ను వారు హెచ్చరిస్తున్నారు . తేడా వస్తే నీ పని అంతే అంటూ ఇంస్టాగ్రామ్ లో కామెంట్లు కూడా పెడుతున్నారు.. మరొకవైపు ఇమ్మానుయేల్ అభిమానులు మాత్రం హీరోగా మొదటి అడుగు వేసినందుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవ్వాలని ఇమ్మానుయేల్ తో పాటు రచన ,దర్శకత్వం వహిస్తున్న బాబుకి కూడా మంచి పేరు రావాలని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ ఎటువంటి వివాదం జోలికి వెళ్లకుండా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.