ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కండల వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కూడా పేరు దక్కించుకున్నాడు. ఐదు పదుల వయసు దాటినప్పటికీ కూడా ఇంకా వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ గానే మిగిలిపోయిన ఈయన కెరియర్లో హీరోయిన్లతో గడిపిన ఎఫైర్ లిస్టే చాలా పెద్దగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా చాలామంది బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్ నడిపాడు సల్మాన్ ఖాన్.. ఆ లిస్టు చూస్తే నిజంగా దిమ్మ తిరగాల్సిందే.
ఐశ్వర్యారాయ్ : సల్మాన్ ఖాన్ అనగానే ముందుగా వినిపించే పేరు ఐశ్వర్యరాయ్.. వీరిద్దరూ అప్పట్లో వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నారట. కానీ సల్మాన్ ఖాన్ ప్రవర్తన నచ్చక ఐశ్వర్యారాయ్ అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.
కత్రినా కైఫ్: కత్రినా కైఫ్ తో దాదాపు నాలుగు సంవత్సరాలు సల్మాన్ ఖాన్ రిలేషన్ లో ఉన్నారని సమాచారం. అంతేకాదు అప్పట్లో వీరిద్దరూ కచ్చితంగా పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వ్యాపించాయి. కానీ మధ్యలోనే వీరి ప్రేమ బంధం ఆగిపోయింది.
షహీన్ జాఫ్రీ:సల్మాన్ ఖాన్ చదువుకునే రోజుల్లో అప్పటి సూపర్ స్టార్ అశోక్ కుమార్ మనవరాలైన షహీన్ జాఫ్రీ తో ఇతడు ప్రేమాయణం నడిపించారు. కానీ అది కాస్త మధ్యలోనే ఆగిపోయింది.
సోమీ అలీ: పాకిస్తాన్ హీరోయిన్ అయిన ఈమెతో కూడా ఆయన కొన్నేళ్లు యవ్వారం నడిపాడు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోయాక సల్మాన్ ఖాన్ దారుణంగా చిత్ర వధ చేశాడని తెలిపింది సోమీ అలీ.
ఇక వీరే కాకుండా జర్మనీకి చెందిన క్లాడియా, స్నేహ ఉల్లాల్ , సంగీత బిజ్లానిల్, యూరోపియన్ కి చెందిన మెహెక్ చాహల్, లులియా, డైసీయా, సోనాక్షి సిన్హా, బ్రిటన్ కి చెందిన హేజల్, పూజా హెగ్డే ఇలా ఎంతోమందితో సల్మాన్ ఎఫైర్ నడిపాడు.