నాని హాయ్ నాన్న మూవీ రన్ టైమ్ ఎంతంటే..?

-

నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బ్యూటిఫుల్ చిత్రం “హాయ్ నాన్న”. మరి ఈ చిత్రం నాని కెరీర్ లో 30వ సినిమాగా కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించగా మంచి బజ్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం ఈ డిసెంబర్ లో రిలీజ్ కి రాబోతుండగా మేకర్స్ మంచి ప్రమోషన్స్ కూడా ఇప్పుడు ఈ చిత్రానికి చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా రన్ టైం కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ద్వారా తెలుస్తోంది.

హాయ్ నాన్న మూవీ 2 గంటల 35 నిడివి ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా లాగే సినిమా సెన్సార్ కూడా క్లీన్ యూ అందుకున్నట్టుగా కూడా తెలిసిందే. దీనితో మొత్తానికి మళ్ళీ నాని ఒక ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామాతో పలకరించేందుకు రాబోతున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం ఈ డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news