ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ మొత్తం కేసులో ఇది ఐదో అనుబంధ చార్జ్ షీట్. ఇందులో మరో నిందితుడు దినేష్ హరోరా పేరును కూడా ప్రస్తావించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ కీలక సూత్రధారి అని అప్రూవల్ గా మారిన నిందితుడు దినేష్ అరోరా నుంచి లంచం తీసుకున్నారని చార్జిషీట్లో ఈడి ఆరోపించింది.
అమితారోరాతో సహా అనేకమంది నిందితులు అనుమానితులతోనూ సంజయ్ సన్నిహితంగా మెదులుతూ ముడుపులు అందుకున్నారని తెలిపింది. 2020-21 అవసరంలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన వేల జరిగిన అవినీతిలో ఆయన భాగస్తులయ్యారని ఈడీ పేర్కొంది. ఇది అరెస్టు చేసిన అప్పటినుంచి సంజయ్ సింగ్ ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు.