డ్రగ్స్ ప్రకంపనలు బాలీవుడ్‌తో పాటు సాండల్ వుడ్‌ని కూడా షేక్ చేస్తున్నాయి. సుశాంత్ మృతి తరువాత రియా కారణంగా బాలీవుడ్‌లో డ్రగ్స్ కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో సాండల్‌వుడ్‌లోనూ డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే దీపిక, సారా అలీఖాన్, రకుల్, శ్రద్ధా కపూర్‌ల పేర్లు బయటికి వచ్చాయి.
ఇటీవలే ఎన్సీబీ ముందు విచారణకు హాజరయ్యారు కూడా. ఇదిలా వుంటే కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కాయ్యారు రాగిణి దివ్వేది, సంజన గల్రాని. ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు వారిని రిమాండ్ నిమిత్తం బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. అయితే తాజాగా వీరు సెక్స్ రాకెట్‌ని కూడా నడిపించారంటూ, దీనికి ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్ చేసి అసంఘిక కార్యకలాపాలు సాగించారని తాజాగా బయటపడింది. అయితే రాగిణి, సంజన ఫోన్‌లని సీజ్ చేసిన ఎన్సీబీ అధికారులకు ఆ ఫోన్‌లలో న్యూడ్ వీడియోలు లభించినట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. అవి ఎవరివి అన్నద మాత్రం ఇంకా తెలియరాలేదు.