రజినీకాంత్ ను చూసి బిచ్చగాడు అనుకున్నది ఎవరంటే..!!

-

సాధారణంగా ఎవరినైనా ఒకరిని చూసిన తర్వాత వారి స్థాయి ఏమిటి కనిపెట్టడం చాలా కష్టం. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే ఇటీవల కాలంలో ఉన్నతంగా బతికిన చాలామంది నిరాడంబరంగా కనిపిస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ హీరోల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోట్లకు పడగ నెత్తిన ఈయన సామాన్య మనిషిలాగ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఒక్కోసారి మనిషిని చూసి అంచనా వేస్తే చిన్నచిన్న పొరపాట్లు కూడా అవుతూ ఉంటాయి ఇందులో పొరపాటు అంటే ఏదో తప్పని కాదు కానీ మిస్ అండర్స్టాండింగ్ అని చెప్పవచ్చు.

బెంగళూరులో ఒక వ్యక్తి ఒకరోజు గుడి ముందు కూర్చొని ఉన్నాడు.. సాధారణమైన బట్టలతో పెరిగిపోయిన జుట్టు, గడ్డంతో ఉన్నాడు ఆ వ్యక్తి .. ఒకావిడ గుడి దగ్గరకు వచ్చింది.. లోపలికి వెళుతూ గుడి దగ్గర కూర్చొని ఉన్న ఆ వ్యక్తిని చూసి అతనిని ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతుండడంతో.. అక్కడున్న బిచ్చగాల్లు అందరికీ డబ్బులు ఇస్తున్న ఈమె ఇతనికి కూడా పది రూపాయలు ఇచ్చి గుడి లోపలికి వెళ్ళింది.. దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి ఆ వ్యక్తి ఒక ఖరీదైన కారు ఎక్కడం చూసి ఆశ్చర్యపోయింది.

అంతేకాదు అతను ఎవరో తెలుసుకోకుండా అలా డబ్బులు ఇచ్చాను అని కారు దగ్గరకు వెళ్లి ఆ వ్యక్తిని ఆమె క్షమాపణ చెప్పింది . అందుకు ఆ వ్యక్తి పర్వాలేదమ్మా.. మీరు ఎలాంటి తప్పు చేయలేదు.. మీ ద్వారా భగవంతుడు నాకు నా హోదాను చూసుకొని వచ్చిన అహాన్ని తొలగించి.. నేను ఒక బిచ్చగాడిని అనే సత్యం తెలియజేశాడు.. అని ఆ మహిళకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయారు. మరి ఆ వ్యక్తి ఎవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ . రజినీకాంత్ ఇంత సాధారణంగా ఉంటారు అనడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం అని చెప్పవచ్చు. అందుకే పెద్దలంటూ ఉంటారు ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉండమని..

Read more RELATED
Recommended to you

Latest news