Big Boss OTT Title: సేమ్ సెంటిమెంట్ రిపీట్..ఈ సారి ‘బిగ్ బాస్’ ఓటీటీ టైటిల్ విన్నర్ ఆమెనే!

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘ఓటీటీ’ వర్షన్ ఆరో సీజన్..రసవత్తరంగా సాగుతోంది. తొమ్మిదో వారంలోకి ఎంటరయిన షోలో.. కంటెస్టెంట్స్..తమ గేమ్ పైనే ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఈ సారి బిగ్ బాస్ ఓటీటీ టైటిల్ విన్ అయ్యే చాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయనే డిస్కషన్ జరుగుతోంది.

గతంలో ‘బిగ్ బాస్’ సీజన్స్ ను ప్రజెంట్ ‘ఓటీటీ’ 24×7 వర్షన్ గేమ్ ను కంపార్ చేస్తూ బెస్ట్ పాజిబులిటీస్ ను చెక్ చేస్తున్నారు. ఆ రకంగా చూసి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో ఎవరూ విన్ అయ్యే చాన్సె్స్ ఉన్నాయని చర్చించుకుంటున్నారు. చాలా కాలం నుంచి బిందు మాధవియే ‘బిగ్ బాస్’ ఓటీటీ టైటిల్ విన్నర్ అని ఈ క్రమంలోనే ప్రచారం జరుగుతోంది.

హమీద కూడా టైటిల్ విన్ చేసుకోవచ్చని అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. గతంతో పోల్చితే గేమ్ ను హమీద చాలా ఇంప్రూవ్ చేసుకుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు కూడా. అయితే, కొందరు బీబీ లవర్స్ గత సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ హమీద, బిందు మాధవిలో ఎవరు ఒకరు టైటిల్ విన్ చేసుకునే చాన్సెస్ ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

గత ‘బిగ్ బాస్’ సీజన్స్ విజేతలు రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్ లు .. ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదని, కానీ, ‘బిగ్ బాస్’ టైటిల్ ఎగరేసుకుపోయారని, అలా హమీద, బిందు మాధవిలలో ఒకరికి డెఫినెట్ గా చాన్సెస్ ఉన్నాయని అంచనా వేస్తు్న్నారు. చూడాలి మరి..ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news