‘మా’ ఎన్నికలు గెలుపెవరిది..!

-

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు మొదలయ్యాయి. నరేష్, శివాజి రాజా పోటీ పడిన మా ఎలక్షన్స్ 800 మంది సభ్యులు ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో ఈసారి ఎవరు అధ్యక్షుడిగా వస్తారన్నది హాట్ న్యూస్స్ గా మారింది. శివాజి రాజా, నరేష్ ఇద్దరు ఒకరిని ఒకరు తప్పుపడుతూ ఈ నాలుగు రోజులు ఛానెల్స్ చుట్టూ తిరిగి హల్ చల్ చేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి శివాజి రాజా ప్యానెల్ కు సపోర్ట్ చేస్తుండగా సూపర్ స్టార్ మహేష్ నరేష్ ప్యానెల్ కు సపోర్ట్ గా ఉన్నారు.

ఇప్పటికే మొదలైన ఈ పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగుతాయని తెలుస్తుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఆ తర్వాత అధ్యక్షుడు ఎవరన్నది వెళ్లడిస్తారు. మునుపెన్నడు లేని విధంగా మా ఎన్నికలు ఈసారి హాట్ టాపిక్ గా మారాయి. శివాజి రాజా ప్యానెల్ కు శ్రీకాంత్, ఉత్తేజ్, తనీష్ వంటి వారు ఉండగా.. నరేష్ ప్యానెల్ లో జీవితా రాజశేఖర్, శివ బాలాజి, మధుమిత వంటి వారు ఉన్నారు. రసవత్తరంగా సాగుతున్న మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే విజేత ఎవరైనా సరే మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పడం విశేషం. మరి కలిసి పనిచేసే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ తో ఎవరిని పిచ్చి వాళ్లని చేస్తున్నారో అర్ధం కావట్లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version