కొడుకు మాట విని 90 కోట్లు లాభపడిన స్టార్..!

-

బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నాడని చెప్పొచ్చు. తను చేస్తున్న ప్రతి సినిమా అక్కడ సూపర్ హిట్ అవుతున్నాయి. ఇక ఈమధ్య వెబ్ సీరీస్ లో కూడా నటిస్తున్నాడు అక్షయ్ కుమార్. డిజిటల్ స్ట్రీమింగ్ లో అమేజాన్ ప్రైం చేస్తున్న ఓ వెబ్ సీరీస్ లో అక్షయ్ ను నటించాలని కోరారట. అయితే అక్షయ్ దానికి ముందు ఒప్పుకోలేదు.

అక్షయ్ తనయుడు ఆరవ్ కోరిక మేరకే అక్షయ్ వెబ్ సీరీస్ కు సై అన్నాడట. అయితే తీరా పారితోషికం సమయానికి వచ్చే సరికి 90 కోట్లు ఇస్తామని చెప్పారట. వెబ్ సీరీస్ కు ఆ రేంజ్ లో ఇస్తారని ఊహించని అక్షయ్ ఈ ప్రాజెక్ట్ మిస్సైతే 90 కోట్లు మిస్సయ్యే వాడినని చెప్పుకొచ్చాడు. మొత్తానికి తనయుడి వల్ల అక్షయ్ కుమార్ ఖాతాలో 90 కోట్లు వచ్చి చేరాయన్నమాట. వెబ్ సీరీస్ కు అంత బడ్జెట్ పెడుతున్నారంటే ఇక ఆ వెబ్ సీరీస్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఈ వెబ్ సీరీస్ ఎనౌన్స్ మెంట్ కు అక్షయ్ కుమార్ ఒంటి నిండా మంటలతో వచ్చి సర్ ప్రైజ్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version