ఎన్టీఆర్ హీరోయిన్ అందుకే వివాహం చేసుకోలేదా..?

-

సినీ ఇండస్ట్రీ అనే ఒక రంగుల ప్రపంచంలో ఎప్పుడు? ఏం జరుగుతుందో? చెప్పడం అనేది.. అంచనా వేయడం కంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కొంతమంది ఉన్నట్టుండి ఉన్నత స్థానానికి ఎదుగుతారు. మరి కొంతమంది ఒకటి రెండు సినిమాలకి దూరం అవుతూ ఉంటారు. ఇక మళ్లీ రీఎంట్రీ ఇద్దాం అన్నా కూడా వారికి అవకాశాలు లేకుండా పోతాయి. ఇక అలాంటి వారిలో ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్లు ఒకటి రెండు సినిమాల ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకొని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇక హీరోయిన్ల విషయానికి వస్తే చాలామంది హీరోయిన్ లు ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి దూరమయ్యారని చెప్పవచ్చు.

కొంతమంది అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైతే మరికొంతమంది గ్లామర్ తో ప్రేక్షకులను మెప్పించలేక ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పవచ్చు. ఇక అలాంటి వారిలో ప్రముఖంగా హీరోయిన్ కీర్తి చావ్లా కూడా ఒకరు ఇక ఈమె తన గ్లామర్ ను మెయింటైన్ చేయలేక ఇండస్ట్రీ నుంచి దూరమైంది. ముఖ్యంగా ఈమె పేరు వినగానే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా గుర్తుకొస్తుంది. ఇక ఈ సినిమాలో ఆమె చబ్బీ చీక్స్.. బబ్లీ లుక్ తో చాలా అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను బాగా అలరించిందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమాతో మంచి ఇమేజ్ అయితే సొంతం చేసుకుంది కానీ ఎక్కువ కాలం ఆ క్రేజ్ ను కాపాడుకోలేకపోయింది.

ముఖ్యంగా పారితోషకం విషయంలో ఎన్నో బ్లాక్బస్టర్ అవకాశాలను కూడా వదులుకుంది.అలా నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమవుతుంది. సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఇదిలా ఉండగా ఇప్పటికీ కూడా ఈమె వివాహం చేసుకోలేదు అందుకు కారణం భయమట.. పెళ్లి తర్వాత పిల్లలను కనాలి కానీ మొదటి నుండి ఆమెకు హాస్పిటల్ అంటేనే భయమట. అందువల్లే ఆమె పెళ్లి చేసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈమె నిర్ణయానికి కొంతమంది ఫైర్ అవుతుంటే మరి కొంతమంది ప్రపంచంలో ఎవరూ నీలా ఉండరు అంటూ నవ్వుతూ ఆమెపై కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news