బాలీవుడ్ ‘బ్రహ్మస్త్ర’ మన్మధుడికి వర్కౌట్ అవుతుందా …?

-

అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమా తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో హిట్ దక్కలేనేలేదు. ఆ తర్వాత వచ్చిన రాజుగారి గది 2, దేవదాస్, మన్మధుడు2 భారీ ఫ్లాప్స్ ని ఇచ్చాయి. దాంతో నాగార్జున ఏ సినిమా చేయాలా అన్న డైలమాలో పడ్డాడు. మళ్ళీ తనకి హిట్ ఇచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా కి ప్రీక్వెల్ తోనే హిట్ కొట్టాలని అనుకున్నప్పటికి ఈ సినిమాలో నటించబోయో చైతూ ప్రస్తుతం ఖాలీ లేక ఆ ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంది.

 

ఇక కొత్త సినిమా ఒకటి చేస్తున్నాడు నాగార్జున. సోలోమెన్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న వైడ్ డాగ్ అనే సినిమాలో మరోసారి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్ నాగ్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. ఇటీవల సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆఫీసర్ అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయినా మరోసారి పోలీస్ ఆఫీసర్ గా రావడానికి డిసైడయ్యాడంటే ఖచ్చితంగా కథ మీద నమ్మకం అని అర్థమవుతోంది.

 

ఇక నాగార్జున బాలీవుడ్ లోను ఒక సినిమాలో నటిస్తున్నాడు. అదే ‘బ్రహ్మాస్త్ర . ఈ సినిమాలో రణబీర్ కపూర్ ఆలియా భట్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. మరి నాగ్ కి ఈ సినిమా ఎలాంటి క్రేజ్ ని తీసుకొస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version