హ‌న్సిక మ‌రో న‌య‌న‌తార అవుతుందా?

-

త‌న పంథా మార్చింది. గ్లామర్ రోల్స్ త‌గ్గించింది. స్టార్ హీరోల సినిమాల్లో ఇలా వ‌చ్చి అలా పోయే రోల్స్ కి గుడ్ బై చెప్పింది. త‌న‌లోని యాక్టింగ్ స్కిల్స్ ని బ‌య‌ట‌పెడుతుంది. బోగ‌న్‌, విల‌న్‌, తుప్ప‌కిమున్నై చిత్రాల్లో న‌టించేందుకు ఛాన్స్ దొరికింది.

గ‌తేడాది వ‌ర‌కు హ‌న్సిక అంటే కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌లే గుర్తొచ్చేవి. స్టార్ హీరోల సినిమాలో హాట్ అందాల‌తో మెరిశారు. చాలా వ‌ర‌కు అలా డ్యూయెట్లు పాడుకోవ‌డానికి మాత్ర‌మే అనేలా హ‌న్సిక పాత్ర‌లుండేవి. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. త‌న పంథా మార్చింది. గ్లామర్ రోల్స్ త‌గ్గించింది. స్టార్ హీరోల సినిమాల్లో ఇలా వ‌చ్చి అలా పోయే రోల్స్ కి గుడ్ బై చెప్పింది.

త‌న‌లోని యాక్టింగ్ స్కిల్స్ ని బ‌య‌ట‌పెడుతుంది. బోగ‌న్‌, విల‌న్‌, తుప్ప‌కిమున్నై చిత్రాల్లో న‌టించేందుకు ఛాన్స్ దొరికింది. రెగ్యుల‌ర్ హీరోయిన్‌కి మించిన రోల్స్ లో త‌న న‌ట‌న‌ని చూపించింది. దీంతో హ‌న్సిక‌లోని యాక్టింగ్ స్కిల్స్ ని చూసి రైట‌ర్స్, డైరెక్ట‌ర్స్ సైతం ఆమె కోసం బ‌ల‌మైన పాత్ర‌లు రాసేందుకు ముందుకు వ‌స్తున్నారు. అందులో భాగంగానే ప్ర‌స్తుతం మ‌హా చిత్రంలో న‌టిస్తుంది. యు ఆర్ జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ థ్రిల్ల‌ర్ సినిమాలో హ‌న్సిక‌ టైటిల్ రోల్ పోషిస్తుంది. ఇందులోని ఆమె లుక్స్ సినిమాపై విశేషమైన క్రేజ్‌ని పెంచ‌డంతోపాటు వివాదాల‌ని తెచ్చిపెట్టాయి.

కానీ అవ‌న్నీ సినిమా ప్ర‌మోష‌న్స్ కి ప‌నికొచ్చాయి. ఈ సినిమా మొత్తం హ‌న్సిక పాత్ర చుట్టే తిరుగుతుంద‌ట‌. ఇది హ‌న్సిక 50వ మూవీ కావ‌డం ఓ విశేష‌మైతే, ఓ ర‌కంగా ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావ‌డం మ‌రో విశేషం. దీంతోపాటు ఈ నెల 9న రిలీజ్ కాబోతున్న 100 సినిమా కూడా హ‌న్సిక పాత్ర ప్ర‌ధానంగానే సాగుతుంద‌ట‌. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇటీవల జ్యోతిక తో జాక్ పాట్ అనే చిత్రాన్ని తెరక్కించిన దర్శకుడు కళ్యాణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.

సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంద‌ట‌. ఇలా వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ మ‌రో న‌య‌న‌తార అనిపించుకునేలా ఉంద‌ని అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి. దీంతోపాటు హ‌న్సిక ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తెనాలి రామ‌కృష్ణ, కోలీవుడ్‌లో పార్ట‌న‌ర్ చిత్రాల్లో న‌టిస్తుంది. తెలుగులో రూపొందుతున్న‌ తెనాలి రామ‌కృష్ణ‌లో సందీప్ కిష‌న్ హీరో. జి.నాగేశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. కామెడీ ఎంట‌ర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version