ఆ అవార్డు బాధ్య‌త జ‌గ‌న్ తీసుకోవాల్సిందే..!

-

ఈ ఐదేళ్ల పాల‌న కాలంలో ఏదో ఒక సంవ‌త్స‌రం విజ‌య నిర్మ‌ల‌కు ప‌ద్మ అవార్డు ఇప్పించ‌డం ఖాయం. ఎందుకంటే వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత కృష్ణ జ‌గ‌న్ కు మ‌ద్ద‌తిచ్చారు. కాబోయే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్ర‌మేన‌ని అంద‌రికంటే ముందుగా చెప్పిన ఏకైక టాలీవుడ్ వ్య‌క్తి.

గిన్నీస్ బుక్ హోల్డ‌ర్ క‌ళావాహిని విజ‌య నిర్మ‌ల ఇటీవ‌ల క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా తెలుగు సినిమాకు ఆమె అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. ఆయితే ఆమె సేవ‌ల‌ను గుర్తించింది చాలా త‌క్కువ‌నే చెప్పాలి. రాష్ర్ట స్థాయి అవార్డులు త‌ప్ప జాతీయ స్థాయిలో ఆమెకు అవార్డులు వ‌రించ‌లేదు. అయినా మ‌నిషి ఉన్న‌ప్పుడు క‌న్నా లేన‌ప్పుడే మాట్లాకునే కొన్ని విష‌యాలుంటాయి. అందులో ఈ అవార్డుల విష‌యం ఒకటి. దాని గురించి విజ‌య నిర్మాల భ‌ర్త సూప‌ర్ కృష్ణ తాజాగా మాట్లాడారు. వైఎస్ రాజ‌వేఖ‌ర్ రెడ్డి గారు బ్ర‌తికి ఉంటే విజ‌య నిర్మ‌ల‌కు ప‌ద్మ‌భూష‌న్ వ‌చ్చుండేది. మేము ఎవ‌రం ఏమీ అడ‌గ‌క‌పోయినా, ఆయ‌న నా సినీ రంగ కృషిని గుర్తు చేసుకుని నాకు ప‌ద్మ‌భూష‌న్ అవార్డు ఇప్పించారు.

ఆయ‌న లేక‌పోతే నాకు ఆ అవార్డు వ‌చ్చి ఉండేది కాదు. త‌ర్వాత ఒక‌టి రెండు సంవ‌త్స‌రాలకు విజ‌య నిర్మ‌ల కు కూడా ఇప్పిస్తాన‌ని మాటిచ్చారు. కానీ అంత‌లోనే ఆయ‌న స్వ‌ర్గుస్తుల‌య్యారు. త‌ర్వాత ఆమెకు ఏ అవార్డు రాలేదు. అయినా ఇప్పుడు అవార్డుల కోసం ఆరాట ప‌డ‌టం లేదు. వెంట‌ప‌డ‌లేదు. మాకు ప్ర‌జ‌ల గుర్తింపు ఉంది. ఆద‌ర‌ణ ఉంది. అంత‌క‌న్నా అవార్డులు ఏమీ గొప్ప కాదు. అస‌లు సిస‌లైన అవార్డు ప్ర‌జ‌ల అభిమాన‌మే అన్నారు. ఈ నేప‌థ్యంలో విజ‌య నిర్మ‌ల ప‌ద్మ‌భూష‌న్ అవార్డు బాధ్య‌త ఆంద్ర‌ప్ర‌దేశ్ నూత‌న ముఖ్య‌మంత్రి, వెస్ త‌న‌యుడు జ‌గ‌న్మోహాన్ రెడ్డి తీసుకునే అవ‌కాశం లేక‌పోలేదు.

ఈ ఐదేళ్ల పాల‌న కాలంలో ఏదో ఒక సంవ‌త్స‌రం విజ‌య నిర్మ‌ల‌కు ప‌ద్మ అవార్డు ఇప్పించ‌డం ఖాయం. ఎందుకంటే వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత కృష్ణ జ‌గ‌న్ కు మ‌ద్ద‌తిచ్చారు. కాబోయే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్ర‌మేన‌ని అంద‌రికంటే ముందుగా చెప్పిన ఏకైక టాలీవుడ్ వ్య‌క్తి. ఇక జ‌గ‌న్ కృష్ణ‌కు అంతే వెయిట్ ఇస్తారు. కృష్ణ అడ‌గాలే కానీ జ‌గ‌న్ కాదు కూడ‌దు అన‌రు. విజ‌య నిర్మ‌ల క‌డ‌సారి చూపుకు జ‌గ‌న్ ఎంత బిజీగా ఉన్నా స్వ‌యంగా హాజ‌ర‌య్యారు. కృష్ణ‌ని ప‌రామ‌ర్శించారు. ఆ మ‌రుస‌టి రోజున మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, బాల‌కృష్ణ వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version