బిగ్‌బాస్ విన్న‌ర్‌… ఆ ఇద్ద‌రి మ‌ధ్యే ట‌ఫ్ ఫైట్‌..!

-

శ్రీముఖి-రాహుల్ బిగ్ బాస్‌హౌస్‌లో మొదట మిత్రులుగా ఎంట్రీ ఇచ్చి శత్రువులుగా మారిపోయారు. మొదటి రెండు వారాల్లోనే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పుడు మొదలైన గొడవలు ఇప్పుడు ఫినాలేకు చేరుకున్న కొనసాగుతూనే ఉన్నాయి. హౌస్‌లో వీరి మధ్య సైలెంట్ వార్ జరుగుతుంటే బయట సోషల్ మీడియాలో వీరి ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ జరుగుతుంది. తమ అభిమాన కంటెస్టంట్ ని సపోర్ట్ చేసుకుంటూనే అపోజిట్ కంటెస్టంట్ పై విపరీతమైన ట్రోల్స్ వేస్తున్నారు. ఈ ట్రోల్స్ విషయంలో ఎవరు తగ్గడం లేదు.

అయితే ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం శ్రీముఖి-రాహుల్ ల్లోనే ఒకరికి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే వీరి ఫ్యాన్స్ మధ్య తీవ్ర ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. బిగ్‌బాస్ ఫినాలేలో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్, అలీ పోటీ పడుతున్నారు. ఈ ఐదుగురులో వరుణ్, అలీలకు విన్నర్ అయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవని తెలుస్తోంది. ఇక బాబా భాస్కర్ కు కొంతవరకు అవకాశాలు ఉన్నాయి గానీ..అది పూర్తి స్థాయిలో కాదని అర్ధమవుతుంది.

ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ ప్రకారం చూసుకుంటే శ్రీముఖి-రాహుల్ మధ్యే టఫ్ ఫైట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా అంచనాల ప్రకారం రాహుల్ కంటే శ్రీముఖినే కొంచెం పైన ఉందని తెలుస్తోంది. కానీ ఇద్దరు మధ్య ఓట్ల శాతంలో పెద్ద తేడా లేదని సమాచారం. కాబట్టి ఓటింగ్ ముగిసే సమయానికి ఏదైనా జరగొచ్చు. అలాగే ఈ మూడు రోజులు బిగ్ బాస్ హౌస్ లో వారు నడుచుకునే తీరు బట్టి కూడా ఓటింగ్ మారే అవకాశం ఉంది. ఇక ఓటింగ్ ఎలా అయిన జరగని…బిగ్ బాస్ విన్నర్ మాత్రం శ్రీముఖి-రాహుల్ ల్లో ఒకరు అవ్వటం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news