వెంకీ నెక్స్ట్ ఎవ‌రితో?

-

ప్రస్తుతం మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి వెంకీమామలో నటిస్తున్న వెంకీ త‌దుప‌రి సినిమా తమిళ హిట్‌ విక్రమ్‌ వేధ రీమేక్‌లో నటించబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇందులో వాస్త‌వం లేదని, ఇవ‌న్నీ ఫాల్స్ న్యూస్ అని వెంకీ సోద‌రుడు, నిర్మాత సురేష్‌బాబు స్ప‌ష్టం చేశారు.

ఈ సంక్రాంతికి విడుద‌లైన మల్టీస్టార‌ర్ ‘ఎఫ్‌2’తో కెరీర్‌ బెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ని అందుకున్నారు వెంక‌టేష్‌. ఆ సినిమా ఇచ్చిన ఎనర్జీతో ఇప్పుడు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఇక‌పై సినిమాల విష‌యంలో స్పీడు పెంచాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న‌తో సినిమా చేసేందుకు అప్ కమింగ్ డైరెక్ట‌ర్స్ నుంచి సీనియ‌ర్స్ వ‌ర‌కు చాలా మంది క్యూ క‌డుతున్నారు.

ప్రస్తుతం మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి వెంకీమామలో నటిస్తున్న వెంకీ త‌దుప‌రి సినిమా తమిళ హిట్‌ విక్రమ్‌ వేధ రీమేక్‌లో నటించబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇందులో వాస్త‌వం లేదని, ఇవ‌న్నీ ఫాల్స్ న్యూస్ అని వెంకీ సోద‌రుడు, నిర్మాత సురేష్‌బాబు స్ప‌ష్టం చేశారు. వెంకీకి సంబంధించి ఫ్రెష్‌గా మ‌రిన్ని కొత్త క‌బుర్లు వినిపిస్తున్నాయి. మరో సినిమాకి వెంకీ గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారట‌. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట.

త్రినాథరావు గతంలో సినిమా చూపిస్త మావ‌, నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే వంటి సినిమాలు రూపొందించిన విషయం విదితమే. ఇందులో రామ్ హీరోగా న‌టించిన‌ హలో గురూ ప్రేమ కోసమే గతేడాది రిలీజై ఫ్లాప్ టాక్ ని అందుకుంది. అయితే ఈ సారి ఓ కొత్త ర‌క‌మైన క‌థ‌ని చెప్ప‌బోతున్నార‌ట‌. ఇటీవ‌ల లైన్ విన్న‌ వెంకీ క‌థ‌కి ఇంప్రెస్‌ అయ్యారట. ఈ చిత్రాన్ని సురేష్‌బాబు తన సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించనున్నట్టు తెలుస్తుంది. ఇదే కాదు వెంకీ కోసం మ‌రో ఇద్ద‌రు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్స్ వెయిటింగ్‌లో ఉన్నార‌ని తెలుస్తుంది.

పూరీ జగన్నాథ్‌, వీరుపోట్ల వంటి దర్శకులు కూడా వెంకీతో సినిమాలు చేయాల‌ని ట్రై చేస్తున్నారట. పూరీతో వెంకటేష్ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. అలాగే వీరు పోట్ల‌తో కూడా ఆయ‌న‌కి ఇదే ఫ‌స్ట్ అవుతుంది. మ‌రి వీరిలో వెంకీ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో ఉంటుంద‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఇక బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ, నాగ‌చైత‌న్య నటిస్తున్న వెంకీమామలో రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఇందులో వెంకీ రైతుగా, నాగ‌చైత‌న్య సైనికుడిగా క‌నిపిస్తార‌ని టాక్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version