విజయ్ హిట్ కొట్టేసాడుగా ..!

347

విజయ్ దేవరకొండ, క్రాంతిమాధవ్ కాంబినేషన్‌లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదలయ్యాయి.విజయ్ దేవరకొండ హీరోగా, క్రాంతిమాధవ్ డైరెక్షన్ లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదలయ్యాయి.

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన రోజే సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. విజయ్ దేవరకొండ తన యాక్టింగ్‌లోను, సినిమా ప్రచారం చేయడం లోనూ సినిమాపై విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసారు. ఈ సినిమాకు సుందర్ సంగీతం అందించారు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ సినిమా నిర్మించారు.

ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. విదేశాల్లో ఈ సినిమా ప్రిమియర్ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విజయ్‌కు మరో బ్లాక్ బస్టర్ అవుతుందా, యావరేజ్ టాక్ తేస్తుందా అనేది తెలియాలి. ఎప్పటికీ ప్రీమియర్ షో చూసిన వాళ్లు ఏమంటున్నారో చూద్దాం..

ఈ సినిమా చూసిన కొంతమంది ఫస్టాఫ్ బావుందని అంటుంటే, సెకండ్ ఆఫ్ కొంచెం తగ్గిందని కొందరు అంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. విజయ్‌కు తోడుగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ అద్భుతంగా నటించారని అంటున్నారు. రాశీఖన్నా ఈ సినిమాలోని తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. రాశీఖన్నా, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత హీరో విజయ్ దేవరకొండ మళ్లీ ఇంకోసారి ఈ చిత్రం లో అద్బుతం గా నటించారని ప్రేక్షకులు అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం మిక్సెడ్ టాక్ తో ముందుకు వెళ్తుంది….