వామ్మో.. నాగచైతన్య ఎఫైర్ లిస్ట్ మామూలుగా లేదుగా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన చాలా రొమాంటిక్ అని అందరూ అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఎంతోమంది హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడిపించారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే హీరో హీరోయిన్ల మధ్య ఏ ఒక్క వార్త బయటకొచ్చినా సరే దాని గురించి ఇంకా ఎన్నో వార్తలు అల్లేస్తూ ఉంటారు జనాలు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు నాగచైతన్యకు ఎంతమంది హీరోయిన్లతో ఎఫైర్ వార్తలు వినిపించాయో ఇప్పుడు చూద్దాం.

సమంత మాత్రమే కాకుండా నాగచైతన్యతో లవ్ ట్రాక్ నడిపిన హీరోయిన్లు ఎవరు అంటే.. ప్రేమమ్ సినిమాలో నటించే సమయంలో శృతిహాసన్ తో ఆయన ఎఫైర్ నడుపుతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై ఎవరు కూడా స్పందించలేదు. ఆ తర్వాత దడ సినిమాలో నటించే సమయంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ నాగచైతన్య కి మధ్య ఎన్నో రూమర్స్ వినిపించడం జరిగింది.నిజంగానే వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉంది అన్నట్టుగా ఇండస్ట్రీలో వార్తలు క్రియేట్ చేశారు.

అలాగే మజిలీ సినిమా సమయంలో సమంతతో పాటు మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ కూడా నటించిన విషయం తెలిసిందే.. అయితే ఆమెతో కూడా ఆయనకు ఎఫైర్లు ఉన్నాయంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈమె వల్లే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. ఇక సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య పేరు ఎక్కువగా వినిపించింది.అంతేకాదు వీరికి సంబంధించిన ఫోటోలు బయటపడ్డ కూడా ఇందులో నిజం లేదని మీరు కొట్టి పారేశారు.

Read more RELATED
Recommended to you

Latest news