ఓ ఇంటివాడు కాబోతున్న యాదమ్మ రాజు.. ఫోటోలు వైరల్..!

-

బుల్లితెరపై బాగా పాపులారిటీ సంపాదించుకొని.. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కామెడీ షో ఏదంటే జబర్దస్త్, పటాస్ షో లు అని చెప్పవచ్చు . ఇప్పుడు పటాస్ ప్రసారం కాకపోయినా.. గతంలో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇందులో కమెడియన్ లుగా నటించిన వారికి కూడా మరింత క్రేజ్ లభించిందని చెప్పవచ్చు. పటాస్ షో ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న చాలామంది జబర్దస్త్ లోకి రావడం.. జబర్దస్త్ లో పేరు తెచ్చుకున్న వారు సినిమాలలోకి వెళ్లడం అన్నీ అలా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు షోలు కూడా ఎంతోమంది కమెడియన్లకు మంచి లైఫ్ ఇవ్వడమే కాకుండా వారికి సినిమాలలో కూడా అవకాశాలు కల్పిస్తూ ఉండడం గమనార్హం.

ఈ క్రమంలోనే తన కామెడీ టైమింగ్ తో పటాస్ కామెడీ షో ద్వారా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఈయన పటాస్ షో కి ఒక స్టూడెంట్ గా షోలో అడుగుపెట్టి .. ఇతను వేసిన జోక్ బాగా పేలడంతో వెంటనే పాటిస్పెట్ గా అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకోవడం జరిగింది. అంతేకాదు తన ఫేమ్ తో ఇప్పుడు సినిమాలలో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా గత కొన్ని నెలల నుంచి స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఒక ఈటీవీ ప్రోగ్రాం లో కూడా వెల్లడించారు.

అంతేకాదు వీళ్ళిద్దరూ కలిసి యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తున్నారు . ఇదిలా ఉండగా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అందరూ అడుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. త్వరలోనే వీళ్ళ పెళ్లి కూడా జరగబోతుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news