KGF 2: రాజకీయం, సినిమాలు రెండు వేర్వేరు.. హీరో యశ్ సంచలన వ్యాఖ్యలు..

-

శాండల్ వుడ్ స్టార్ హీరో యశ్ ‘కేజీఎఫ్’ సినిమాతో నేషన్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ చిత్రం చూసి సినీ లవర్స్ చాప్టర్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొవిడ్ మహమ్మారి ప్రభావం వలన చిత్రాల షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చాయి. తద్వారా ఫిల్మ్స్ రిలీజ్ కూడా చాలా ఆలస్యమయింది. కాగా, ఎట్టకేలకు ఈ చిత్ర చాప్టర్ 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే చాప్టర్ 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో యశ్ సినిమా, రాజకీయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘కేజీఎఫ్’ చాప్టర్ 2 వచ్చే నెల 14న విడుదల కానుంది. ఇకపోతే ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నెక్స్ట్ లెవల్ లో మూవీ ఉంటుందని ట్రైలర్ చూసి అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. కాగా, ఈ సినిమా విడుదలకు ముందు రోజు అనగా ఏప్రిల్ 13న తమిళ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ‘కేజీఎఫ్’ చాప్టర్2తో కంపేర్ చేస్తున్నారు. అలా పోల్చుకోవడంపైన యశ్ స్పందించారు.

‘బీస్ట్’, కేజీఎఫ్ ‘చాప్టర్2’ రెండు చిత్రాలను పోల్చి చూడొద్దని కోరారు. సినిమా రంగంలో అలా చేయడం సరికాదని చెప్పారు. రాజకీయాల్లో పోలికలు ఉంటాయని, కానీ, సినిమాల్లో అలా ఉండబోదని పేర్కొన్నారు. ఒక సినిమాతో మరో సినిమాతో పోల్చవద్దని ఈ సందర్భంగా హీరో యశ్ కోరారు. సినిమాలు, రాజకీయం రెండు వేర్వేరని వివరించారు. రెండు సినిమాలను చూసి చిత్ర రంగంలో సంబురాలు చేసుకుందామని యశ్ పిలుపునిచ్చారు. ఇక యశ్ మాటల తర్వాత అభిమానులు కొంచెం సైలెంట్ అయ్యారు. యశ్ మాటల పట్ల సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా యశ్ మాట్లారని కొనియాడుతున్నారు. కోలీవుడ్ ఫిల్మ్ ‘బీస్ట్’కు కూడా వసూళ్ల వర్షం కురిసేలా యశ్ మాటలు దోహదపడుతాయని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version