అన్నయ్య కోసం యంగ్ టైగర్ వస్తున్నాడు…..!!

యువ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా సినిమా ఎంత మంచివాడవురా. కుటుంబ కథా చిత్రాలు తీయడంలో మంచి పేరు సంపాదించిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుండగా, గోపి సుందర్ సంగీతాన్ని, రాజ్ తోట ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్, ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. శరత్ బాబు, సుహాసిని, విజయ్ కుమార్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి నందమూరి ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని ఎంతో అలరించడం జరిగింది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈనెల 8వ తేదీన రాత్రి 7 గంటలకు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నాం అని, అలానే ఈ వేడుకకు స్పెషల్ గెస్ట్ గా కళ్యాణ్ రామ్ సోదరుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ విచ్చేస్తున్నట్లుగా సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. గతంలో కూడా తన అన్నయ్య సినిమా ఫంక్షన్స్ కు విచ్చేసిన ఎన్టీఆర్, మరొక్కమారు ఈ సినిమా వేడుకకు కూడా వస్తుండడంతో నందమూరి ఫ్యాన్స్ లో మరింత ఆనందం వెల్లివిరిసింది అనే చెప్పాలి.

సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉండడంతో, రేపు రిలీజ్ తరువాత మా సినిమా అందరి అంచనాలు అందుకుంటుందని దర్శకుడు సతీష్ నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో పలు పెద్ద సినిమాలు నిలుస్తున్నప్పటికీ, వాటితో పాటు తమ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని దర్శకుడు సతీష్ చెప్పడం జరిగింది. మరి ఇటీవల కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేని కళ్యాణ్ రామ్ కు, ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందిస్తుందో చూడాలి..!!