హర్ష సాయి మరో ఆడియో లీక్‌..బాగోతం బయట పడిందిగా !

-

హర్ష సాయికి సంబంధించిన మరో ఆడియో తెరపైకి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం నెలకొంది. వివాదానికి సంబంధించిన ఆడియో లీక్ అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే హర్ష సాయి ఇమేజ్పై దెబ్బ పడుతుందని కో ప్రొడ్యూసర్, బాధితురాలు అన్నట్లు ఇందులో బయటపడింది. దీంతో ఆ ప్రభావం మెగా సినిమాపై కూడా పడుతుంది అని చెప్పారు బాధితురాలు… బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆపేయాలని బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం నెలకొందట.

Youtuber Harsha Sai Sensational Audio Leak

లోటస్ 360 అనే బెట్టింగ్ యాప్ ను నిషేధించింది సెంట్రల్ గవర్నమెంట్. కానీ నిషేధించిన బెట్టింగ్ యాప్ లింక్ తన వీడియోలో పెడితే 10 కోట్లయినా ఇస్తారు అని ఆడియోలో చెప్తున్నారు హర్ష సాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం ఎన్ని కోట్లయినా తీసుకుంటానని నిస్సుగ్గుగా చెప్పిన హర్ష సాయి… తాను కాకపోతే మరో పదిమందితో వెడ్డింగ్ యాప్స్ నిర్వాహకులు ప్రమోషన్స్ చేయిస్తారన్నారు. తాను కచ్చితంగా ప్రమోషన్స్ చేయాలి అవి నా మార్కెట్ ర్యాలీని పెంచుతాయి అని అంటున్న హర్ష సాయి…ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ను సమర్ధించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version