కార్పోరేటర్ అయిపోయిన జబర్దస్త్ కమెడియన్..!

Join Our COmmunity

బుల్లితెరపై గత ఎనిమిది ఏళ్లుగా దూసుకెళ్తున్న షో జబర్డస్త్. ఈ షో ద్వారా చాల మంది కమెడియన్స్ బుల్లితెరకు పరిచయమైయ్యారు. ఇక ఈ షో ద్వారా చాల మంది చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు. ఇక షకలక శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన హీరోగా మరో సినిమా వస్తుంది. ఇప్పటికే ఈయన నుంచి అరడజన్ సినిమాలు వచ్చాయి. కానీ వచ్చినట్లు ఎవరికీ ఐడియా లేదు. వచ్చిన సినిమా వచ్చినట్లు అలాగే వెనక్కి వెళ్లిపోయింది. అయినా కూడా హీరోగా షకలక శంకర్‌కు అవకాశాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇంకా వస్తాయనే ఆశతోనే ఉన్నాడు శంకర్.

Shakalaka-Shankar
Shakalaka-Shankar

ఇదిలా ఉంటే ఇప్పుడున్న గ్రేటర్ ఎన్నికల వేడిని వాడుకుంటూ ఈయన ప్రస్తుతం కార్పోరేటర్ అనే సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని స్టిల్స్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. గ్రేటర్ ఎన్నికల వేళ ఈ చిత్ర టైటిల్‌తో పాటు మిగిలిన విశేషాలను కూడా ప్రకటించారు. సంజయ్ పూనూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సమీప మూవీస్-ఎయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతగా వ్యహరిస్తున్నారు.

ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అందులో కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు శంకర్. ఈ సినిమా కథ మొత్తం విజయవాడ నేపథ్యంలోనే జరుగుతుంది. ఇందులో వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుందని చెప్పాడు దర్శకుడు సంజయ్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో శంకర్‌కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరితో రొమాన్స్ చేయబోతున్నాడు శంకర్. మొత్తంగా తన రాజకీయాల్లో రూల్స్ అనేవి ఉండవని పోస్టర్‌లోనే క్లారిటీ ఇచ్చేసాడు శంకర్. మరి హీరోగా కార్పోరేటర్ అయినా శంకర్ కోరుకున్న గుర్తింపు తీసుకొస్తుందో లేదో చూడాలి మరి.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news