Satyadev : ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వచ్చేసిన సత్యదేవ్

-

తెలుగు సినీ ప్రేక్షకులకు విభిన్నమైన చిత్రాలతో మెప్పించ గలిగే హీరోలలో నటుడు సత్యదేవు కూడా ఒకరు. ప్రస్తుతం వరుస గా సినిమాలతో దూసుకుపోతున్నారు. నటుడిగా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న సత్యదేవ్ హీరోగా నటించిన గుర్తుందా సీతాకాలం సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇక ఎప్పుడు అయితే తన నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు అనౌన్స్ అయ్యింది. సత్యదేవ్ కెరీర్ లో 26వ సినిమాగా రాబోతుండగా, ఈ చిత్రాన్ని ఈశ్వర్ కార్తీక్ అయితే దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ చిత్రానికి మేకర్స్ “జీబ్రా” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేసి ఓ ఆసక్తికర పోస్టర్ ని డిజైన్ చేసి రిలీజ్ చేశారు. దీనితో ఈ సినిమా ఓ సాలిడ్ థ్రిల్లర్ లా అయితే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించనుండగా కేజిఎఫ్ సంగీత దర్శకుడు రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఓల్డ్ టౌన్ పిక్చర్స్ మరియు పద్మజ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news