నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవ్వగా.. డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హ్యారీస్, రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నాడు. వీరిద్ధరి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. అయితే, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఊహించడం చాలా కష్టంగా మారింది. మొన్నటివరకు కమలా ముందు వరుసలో ఉండగా.. ప్రస్తుతం ట్రంప్ అనుహ్యంగా పుంజుకున్నాడు.
ఇదిలాఉండగా, అమెరికా ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా భయపడుతోంది. అక్కడి బ్యాంకులు 500 బిలియన్ డాలర్ల నష్టాల్లో కూరుకుపోయాయి. లిక్విడిటీ కొరత ఉన్నది. జాతీయ అప్పు 35 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నది. బంగారం, పెట్రోల్ లేకుండా ముద్రిస్తున్న డాలర్లు చిత్తుకాగితాలతో సామానమని కియోసాకి లాంటి ఆంత్రప్రెన్యూర్స్, ఎకానమిస్టులు బహిరంగంగా చెబుతున్నారు. ఇక బ్రిక్స్ కరెన్సీ వస్తే అమెరికా ఆర్థిక బుడగ ఏ క్షణమైనా పేలొచ్చని వార్నింగ్ ఇస్తున్నారు.