మహా అన్న పదం శివుడికి ఎలా వచ్చిందో తెలుసా?

దేవుడులకు మహా అన్న పేరు ఉంటుంది.. ముఖ్యంగా శివుడిని మహా శివుడు అంటారు.అసలు ఆ పదం ఎలా వచ్చిందనే విషయం చాలామందికి తెలియదు..మిగిలిన వాటి కంటే గొప్పదైన వాటిని, అత్యుత్తమమైన వాటిని మహా అంటారు.ప్రతి నెల శివ రాత్రి పర్వదినం వస్తుంది. ప్రతి బహుళ చతుర్ధసి రోజు వచ్చేది శివ రాత్రి. అయితే మాఘ బహుళ చతుర్దశి వచ్చే శివ రాత్రిని మహా శివ రాత్రి అంటారు. అలాగే ప్రతి ఇంట్లో బారసాలా, నామ కరణం పుట్టిన రోజు, ఉనయనం వంటి ఎన్నో పండగలు జరుగుతుంటాయి..

అయితే, మనిషి జీవితంలో పెళ్ళి అనేది జీవితంలో ఒకసారి మాత్రమే జరుగుతుంది.. అందుకే దాన్ని కళ్యాణ మహోత్సవం అంటారు.సృష్టికి ఈశ్వరుడు బ్రహ్మ. స్థితికి ఈశ్వరుడు విష్ణువు. విద్యలకి ఈశ్వరుడు వినాయకుడు. సంగీతానికి ఈశ్వరి సరస్వతి. ధనాలకి ఈశ్వరుడు కుబేరుడు. అందరూ ఈశ్వరులకూ ఈశ్వరుడు అంటే అందరినీ తన వశంలో ఉంచుకునే వాడు మహా+ఈశ్వరుడు అవుతాడు అతడే మహేశ్వరుడు.

మహా శివుడు అని కూడా అంటారు..శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవతల్లో ప్రధానమైన వాడు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థం… అందుకే హిందువులు శివుడిని ఎక్కువగా పూజిస్తారు.హిందువులు పూజించే దేవుళ్లలో శివుడు ప్రథముడు. మహేశ్వరుడు పశుపతిగాను, లింగం రూపంలోనూ సింధు నాగరికత కాలానికే పూజలు అందుకున్నాడు..శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని అంటారు..ఇది మహా శివుడి వెనుక ఉన్న అర్థం..