అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం జరుగనుంది. ఇవాళ రాత్రి 10:30 గంటలకు జరుగునున్న కళ్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాల నలుమూలల నుండి అంతర్వేదికి 105 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాఉ. పోలీసులు, బందోబస్తు మరింత పటిష్టంగా ఏర్పాట్లు చేశారు. వెయ్యి మంది పోలీసు సిబ్బందితో 9 సెక్టార్లుగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/Antarvedi.jpg)
ఎస్పీ, అడిషనల్ ఎస్సీ, 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలతో ఉత్సవాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఉండనుంది. ఎన్టీఆర్ఎఫ్, స్పెషల పార్టీ, మెరైన్ పార్టీలతో పర్యవేక్షణ, 100 సీసీ కెమెరాల ఏర్పాటు, డిజిటల్ డిస్ప్లే, 12 ఎస్ఈడీ స్క్రీన్లతో భక్తులు స్వామివారి కల్యాణం తిలకించే అవకాశం ఉంది. క్యూలైన్లలో పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఆరు ప్రసాదం కౌంటర్ల ఏర్పాటు జరిగింది. కల్యాణం అనంతరం భక్తులకు అక్షింతల పంపిణీ చేయనున్నారు.