మన దేశంలో అతి పెద్ద శివలింగం ఎక్కడ ఉందో తెలుసా ..!

284

తమిళనాడు లోని తంజావూరులో వేయి సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం ఉంది. ఇందులో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ఈ దేవాలయం నిర్మాణానికి ఉక్కు గాని, సిమెంట్ గాని వాడలేదు. పదమూడు అంతస్తుల్లో నిర్మితమైన ఈ దేవాలయాన్ని పూర్తిగా గ్రానైట్ తో నిర్మించారు.భారత దేశం మొత్తం మీద పదమూడు అంతస్తులు కలిగిన ఏకైక దేవాలయం.

అక్కడ గోపురం ఎనభై టన్నుల ఏక శిల తో చేసిన గోపుర కలశం ఇక్కడ విశేషం . మనం మాట్లాడే ధ్వని ఇక్కడ మళ్ళి ప్రతిధ్వనించదు. అంతటి పరిజ్హానం తో ఆ దేవాలయాన్ని నిర్మించారు. మిట్ట మద్యాహ్నం గోపురం నీడ ఎక్కడా కనపడదు. ఆలయం నీడ కనపడుతుంది కాని గోపురం నీడ మాత్రం కనపడదు. అదంతా గ్రానైట్ తో ఆలయం నిర్మించడం వల్ల కావచ్చు. ఇక్కడి శివ లింగం 3.7 మీటర్లు ఎత్తు ఉంటుంది.

ఆలయం చుట్టూ రాతి తోరణాలు ఆరు మిల్లిమీటర్ల కన్నా తక్కువగా వంపు తిరిగి ఉంటాయి.అసలు అవి ఎందుకు అలా ఉన్నాయో ఇప్పటికి ఒక మిస్టరీ గానే ఉంది. పురాతన ఆలయాలన్నీ పాడుబడి నట్టుగా ఉంటె ఈ ఆలయం మాత్రం ఎప్పటికి కొత్తగానే ఉంటుంది. ఈ ఆలయం చూడటానికి ఈ మద్య కట్టిన దానిలా ఉంటుంది. ఇది ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరింది.