గుడ్ న్యూస్;కరోనాకు ఈ మందు వాడండి…!

-

కరోనా వైరస్ కి మందు కనుక్కోవడానికి గాను అన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా వైరస్ మందు కనుక్కోవడానికి చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ ని తగ్గించడానికి గానూ. వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తాజాగా కీలక ప్రకటన చేసింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌తో వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అని సూచించింది.

వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న వారిలో నివారణ చర్యల్లో భాగంగా గానూ… ఈ మందు వాడుకోవచ్చు అని సూచించింది. దీనికి ప్రొటోకాల్‌కు భారత ఔషధ నియంత్రణ జనరల్‌(డీజీసీఐ) ఆమోద ముద్ర వేసింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడకం ఏ విధంగా ఉంటుంది అంటే… కరోనా బాధితులు, అనుమానిత రోగులకు వైద్య సేవలు అందించే సిబ్బందికి కొవిడ్‌ లక్షణాలు లేకపోయినా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వాలి.

కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు వ్యాధి లక్షణాలు లేకపోయినా సరే దానిని ఇవ్వాలి. ఇది కేవలం ముందు జాగ్రత్త చర్య మాత్రమే. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే దీనిని తీసుకోవాలి. వైద్య సిబ్బంది తొలి రోజు రెండుసార్లు 400 ఎంజీ మోతాదులో, ఏడు వారాల పాటు వారానికి ఒకసారి 400 ఎంజీ మోతాదులో భోజనంతో కలిపి తీసుకుంటే కరోన వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news