మన దేశంలో ఆలయాలకు కొదవలేదు..ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి..అందులో కొన్ని పుణ్య క్షేత్రాలు కూడా ఉన్నాయి.అలాంటి పుణ్య క్షేత్రాలలో ఒకటి గండి ఆంజనేయస్వామి..కడప జిల్లా గండిలోని వీరాంజనేయస్వామి దేవాలయం. ఇక్కడ అదశ్యరూపంలో ఉండే బంగారు తోరణం మహనీయులకు మాత్రమే కనిపిస్తుంది. అంతే కాకుండా ఇక్కడ సజీవమైన హనుమాన్ మూర్తిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి ఒక పాదానికి చిటికెనవేలు ఉండదు. ఆ చిటికెనవేలును చెక్కేందుకు ఎవరు ప్రయత్నించినా స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది. అందుకే ఇక్కడి మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా పేర్కొంటారు..ఈ ఆలయం గురించి పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
త్రేతాయుగం నాటికే ఆ ప్రాంతం వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ వాయుదేవుడు తపస్సు చేసుకొంటూ ఉండటం వల్లే ఈ క్షేత్రానికి వాయు క్షేత్రమని పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.గండిక్షేత్రానికి చేరుకొన్న ఆ శ్రీరాముడిని తన ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా వాయుదేవుడు కోరుతాడు. అయితే వాయుదేవుడి అభ్యర్థనను శ్రీరాముడు సున్నితంగా తిరస్కరిస్తాడు.ప్రస్తుతం సీత జాడ కోసం వెతుకుతున్నానని శ్రీరాముడు వాయుదేవుడికి చెబుతారు.అయితే సీత దొరికిన తర్వాత తప్పకుండా ఇక్కడికి మరాలా వచ్చి నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని చెబతారు. అన్నుకొన్నట్లుగానే శ్రీరాముడు సీతను శ్రీలంకలో రావణుడు ఉంచాడని తెలుసుకొంటాడు.
ఆ తర్వాత యుద్ధంలో వాయుదేవుడు సాయంతో రావణుడును సంహరిస్తాడు.అటు పై అయోధ్యకు బయలుదేరుతాడు. దీంతో వాయుదేవుడు సీత, రామ, లక్ష్మణులకు స్వాగత ఏర్పాట్లు చేస్తాడు.గండి క్షేత్రానికి వస్తున్న విషయం తెలుసుకొని అక్కడ తన తప:శక్తిని వినియోగించి ప్రక`తిని అందంగా తీర్చిదిద్దుతాడు. ముఖ్యంగా గండి క్షేత్రానికి దగ్గరగా బంగారు తోరణాన్ని నిర్మిస్తాడు.రెండు కొండలను వేరుచేసే పాపాగ్నీ నది పై నిర్మించిన ఆ బంగారు తోరణం సూర్య రశ్మి సోకి విభిన్న అందాలతో శ్రీరామ చంద్రుడికి స్వాగతం పలుకుతుంది.
గండికి ఎలా చేరుకోవాలి..
తిరుపతి నుంచి వచ్చేవారు రాయచోటి మీదుగా ప్రయాణించి వీరాంజనేయుడిని సందర్శించుకోవచ్చు. ఇక కడప జిల్లా చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రం ఉంది.కేంద్రం నుంచి పులివెందుల వెళ్లే బస్సులో వేంపల్లే చేరుకొని అక్కడి నుంచి గండి చేరుకోవచ్చు. ఇందుకు నిత్యం ప్రభుత్వ, ప్రైవేటు బస్సులతో పాటు ఆటోలు, జీపులు అందుబాటులో ఉన్నాయి.