చిదంబర నటరాజ స్వామిని చూసి తరిద్దాం!

Join Our Community
follow manalokam on social media

చిదంబర నటరాజ స్వామి ఆలయం తమిళనాడులో కడలూరు జిల్లాలో ఉంది.శివ,వైష్ణవులను ఒకే దేవాలయంలో పూజించే ఒకే ఒక్క కట్టడం. ఇది పురాతన ద్రావిడ శైలిలో నిర్మించిన అద్భుతంగా రూపొందించారు. ఆలయ గంటల శబ్దంతో మేల్కొని చిదంబర నటరాజ స్వామి ఆలయం ఉంటుంది. ఆలయంలో ప్రధాన దేవత శివునికి పూజలు చేస్తారు. శైవులకు ఇది ఇష్టమైన గమ్యం. ఈ దేవాలయం తమిళనాడులో ఉన్న ఐదు పంచభూత శివాలయాల్లో ఇది ఒకటి. ఈ 5 అంశాలు ప్రతి ఒక్కదానితో మరోటి సంబంధం కలిగి ఉంటుంది. చిదంబరంలో పర్యాటక ప్రదేశాలు కాళహస్తి నాథర్‌ ఆలయం, అగ్నికి సంబంధించి కంచి ఏకాంబరేశ్వర ఆలయం, నీటికి సంబంధించి తిరువనైకల్‌ జంబుకేశ్వర ఆలయం, ఇతర ఆలయాలు ఉన్నాయి.

ఆలయంలో శివుడిని ‘నటరాజ’ నృత్య రూపంలో పూజించే ఏకైక శివాలయం. సాధారణంగా ప్రతి శివాలయంలో శివుడిని ‘శివలింగ’ రూపంలో పూజిస్తాం. కానీ ఇక్కడ నటరాజ విగ్రహ రూపంలో పూజిస్తాం.
పరమశివుడు, మహావిష్ణువు ఇద్దరినీ పక్కపక్కనే పూజలు చేసే ప్రధాన ఆలయం ఇక్కడ మాత్రమే ఉంటుంది. శైవులు, వైష్ణవులు ఇద్దరి కోసం ఉన్న దేవాలయం. విష్ణుమూర్తి గోవిందరాజు పెరుమాళ్‌ స్వామిగా, శివుడు ఇద్దరు దేవతలను పూజించడం ఇక్కడే జరుగుతుంది.

చిదంబరం కేవలం విద్యాసంస్థలు కాకుండా ఇతర అనేక దేవాలయాలకు నిలయంగా మారింది. ఈ దేవాలయాలను వివిధ రాజవంశీయులు పునరుద్ధరించారు. అన్నామౖలై విశ్వవిద్యాలయం కూడా ఇక్కడే ఉంది. దీని కింద అనేక ఇతర విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ పట్టణం ఆభరణాల తయారీకి ప్రసిద్ధి పొందింది. లిగ్నైట్‌ గనులు కూడా ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని సంవత్సరంలో ఎప్పుడైనా సందర్శించవచ్చు. దారిపొడవునా మొక్కలతో అద్భుతంగా ఉంటుంది.

చేరుకోవడం ఎలా?

చిదంబరం రహదారులకు అద్భుతమైన నెట్‌వర్క్‌ ఉంది. తమిళనాడు ప్రభుత్వం మిగిలిన మార్గాలతో అనుసంధానం చేశారు. సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...