భక్తి: పుష్పాలతో పూజ చేసేటప్పుడు ఈ తప్పుల్ని చేయకండి…!

Join Our Community
follow manalokam on social media

ఏ పూజ చేసినా మనం తప్పక పుష్పాల తో పూజ చేస్తూ ఉంటాము. నిత్య పూజ చేసినా కూడా పువ్వులు తప్పక దేవుడికి సమర్పిస్తాము. అయితే నిజంగా పుష్పాలని దేవుడికి ఎందుకు పెట్టాలి…?, నిజంగా పుష్పాలతో పూజ చెయ్యచ్చా…? అన్న సందేహాలు వస్తూనే ఉంటాయి. దాని కోసం చూస్తే… భక్తి పూర్వకంగా పరిశుద్ధమైన మనస్సు తో ఎవరైతే పుష్పాన్ని గాని పండును గాని కొద్ది పాటి జలమును గాని సమర్పిస్తారో అట్టి వారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా తీసుకుంటాను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత లో చెప్పారు. అయితే భగవద్గీత లోనే పుష్పాల తో పూజ చేయాలి అన్న ప్రస్తావన వచ్చిందంటే… పుష్పాలు పూజ కి ఎంత ముఖ్యమో మనకి అర్థమయ్యే ఉంటుంది.

ఏది ఏమైనా గుర్తు పెట్టుకోవాల్సిన విష్యం ఏమిటంటే…? సూచి, శుభ్రత తో ఏ పుష్పం పెట్టినా మంచిదే. పురిటి వాళ్లు, మైల వాళ్లు, బహిష్టు అయిన స్త్రీలు పుష్పాలను తాకరాదు. అటువంటి పూలని దేవునికి సమర్పించడానికి పనికి రావు. అలాగే వాసన చూసిన పువ్వులని, భూమి పై పడిన పుష్పాలు, కడిగిన పుష్పాలను పూజకు వినియోగించ రాదని శాస్త్రం చెబుతోంది.

వాడి పోయినవి, ముళ్ళ తో కూడుకున్నవి, అపరిశుభ్రత మైనవి, దుర్గంధ పూరితమైన పుష్పాలని దేవుడికి పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజలకు పవిత్రమైన పుష్పాలు ఏమిటి అనే విషయానికి వస్తే… తామర పువ్వులు, కలువ పువ్వులు, జాజులు, చామంతి, మందార, కనకాంబరాలు, పారిజాతాలు, పద్మాలు, ముని గోరింట, ఎర్ర గన్నేరు, గరుడ వర్ధనం, నిత్యమల్లి వంటివి చాలా పవిత్రమైనదని చెబుతున్నారు పండితులు. అలానే జుట్టు ముడి లో తులసి దళాన్ని ధరించకూడదు అని అంటున్నారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...